ప్రజా భవన్ వేదికగా ముఖ్యమంత్రాంగం - చంద్రబాబుకు రేవంత్ కాళోజీ పుస్తకం బహూకరణ - CM Revanth book Presented to CBN - CM REVANTH BOOK PRESENTED TO CBN
🎬 Watch Now: Feature Video
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jul 6, 2024, 9:40 PM IST
CM Revanth Presented book to AP CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ముఖాముఖి భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబు నాయుడుకు, సీఎం రేవంత్‌రెడ్డి, సహచర మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం కాళోజీ రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని చంద్రబాబుకు రేవంత్ బహూకరించారు. అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చించారు.
తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదికైంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా, విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారంపై, అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కుల గురించి చర్చలు జరిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. నిర్ణీత వ్యవధిలోగా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎంలు ఇద్దరూ నిర్ణయించారు.