ఆచార్య జయశంకర్‌కు నివాళులు అర్పించిన రాజకీయ నేతలు - CM revanth tribute to jayashankar - CM REVANTH TRIBUTE TO JAYASHANKAR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-06-2024/640-480-21760534-thumbnail-16x9-cm-revanth.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jun 21, 2024, 2:52 PM IST
Political Leaders Tribute To Acharya Kothapalli Jayashankar : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తన నివాసంలో జయశంకర్ చిత్రపటానికి అంజలి ఘటించారు.
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్‌అలీ సహా పార్టీ నేతలు పాల్గొన్నారు. జయశంకర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ మహనీయుడు చూపిన బాటలోనే మాజీ సీఎం కేసీఆర్ నడిచారని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జయశంకర్ ఆశించిన స్థాయిలోనే తెలంగాణకు ఎలాంటి ఫలితాలు రావాలి అనుకున్నారో అవన్నీ కేసీఆర్ చేశారని అన్నారు. ఆయన మార్గంలో నడిచిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టి 10 ఏళ్లలో మూడింతలు చేశారని తెలిపారు. తెలంగాణ జాతీ ఎప్పటికీ ఆచార్య జయంకర్ను మరవదని జగదీశ్ రెడ్డి అన్నారు.