LIVE : పోలీసు డ్యూటీ మీట్ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి - POLICE DUTY MEET CLOSING CEREMONY
🎬 Watch Now: Feature Video
Published : Oct 19, 2024, 6:20 PM IST
|Updated : Oct 19, 2024, 7:37 PM IST
CM Revanth Participated Police Duty Meet Closing Ceremony : పోలీసు డ్యూటీ మీట్ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన పోలీసులు పాల్గొన్నారు. తెలంగాణలోని పోలీసు డ్యూటీ మీట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం పోలీసుల్లో బృంద స్ఫూర్తిని పెంచుతుందని తెలిపారు. అన్ని కేసులను సాంకేతిక ఆధారాలతో ఛేదించాలని సూచించారు. న్యాయం జరిగితేనే బాధితులకు పోలీసు వ్యవస్థపై నమ్మకం వస్తుందని చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేయాలన్నారు. పోలీస్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు రానున్న రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు. దైనందిన డ్యూటీలో భాగంగా కేసుల విచారణలు, మెలకువలపై ఇక్కడ పోటీలు ఏర్పాటు చేశారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్‌నెస్ తదితరాలపై పోటీలున్నాయి. కేసుల ఛేదన, ఆధారాల సేకరణపై ఉన్నతాధికారులు సూచనలు చేశారు.
Last Updated : Oct 19, 2024, 7:37 PM IST