LIVE : పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి - ప్రత్యక్షప్రసారం - cm Revanth hyderabad live
🎬 Watch Now: Feature Video
Published : Feb 4, 2024, 11:11 AM IST
|Updated : Feb 4, 2024, 1:28 PM IST
CM Revanth Reddy Live : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 5 మందికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించగా వారిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవి ఉన్నారు. పద్మశ్రీ పురస్కారం 34 మందికి ప్రకటించగా తెలంగాణకు చెందిన ఐదుగురు కళాకారులకు, ఏపీకి చెందిన ఒకరికి ఈ పురస్కారం వరించింది. వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకత కనబరుస్తూ పెద్దగా ప్రచారానికి నోచుకోని మట్టిలో మాణిక్యాలకు అవార్డుల ఎంపికలో పట్టం కట్టారు. తెలంగాణ నుంచి చిందు యక్షగానంలో గడ్డం సమ్మయ్య, బుర్ర వీణ వాద్య కళాకారుడు దాసరి కొండప్ప, గ్రంథాలయ ఉద్యమకారుడు కూరెళ్ల విఠలాచార్య, స్థపతి వేలు ఆనందాచారి, భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించిన కేతావత్ సోమ్లాల్‌కు పురస్కారాలు వరించాయి. ఏపీకి చెందిన హరికథా కళాకారిణి డి.ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురస్కారం వరించింది. పద్మ అవార్డు గ్రహీతలకు ప్రముఖలు అభినందనలు తెలిపారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళావేదికలో యంగ్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం, కల్చర్ ఆధ్వర్యంలో పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు.