మంత్రులకు జగన్ సూచనలు - ఎన్నికల నాటికైనా పనితీరు మార్చుకోవాలని హితవు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 6:46 PM IST
CM Jagan Discussion on Political Issues with Ministers: కేబినెట్ అజెండా ముగిసిన అనంతరం కొద్దిసేపు మంత్రులతో రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. సీట్ల మార్పు పై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను దీటుగా తిప్పికొట్టాలని సీఎం మంత్రులకు సూచించారు. స్థానచలనం పొందిన మంత్రులు జనంతో మమేకం కావాలన్నారు. ఒకరిద్దరు మంత్రుల పనితీరు గురించి సీఎం తీవ్ర స్వరంతోనే మాట్లాడినట్లు సమాచారం. మంత్రుల పనితీరును గురించి సీఎం పోల్చి మరీ చర్చించారు. ఎన్నికల నాటికైనా పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అమాత్యులకు హితవు పలికారు.
Change of Incharges in YSRCP: నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల విషయంలో కొంత మంది నేతలు ఆసంతృప్తితో ఉన్నారు. వారిని పార్టీ అధిష్ఠానం బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. సీఎం జగన్ ఇప్పటి వరకు 4 జాబితాల్లో 59 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల అభ్యర్థులను మార్చేశారు. మరికొన్ని కీలక స్థానాల్లోనూ ప్రస్తుతం ఉన్న వారిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.