చంద్రబాబుతో మహారాష్ట్ర సీఎం భేటీ - ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేసిన ఏక్‌నాథ్ శిందే - CBN Meet Eknath Shinde in Mumbai - CBN MEET EKNATH SHINDE IN MUMBAI
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-07-2024/640-480-21950896-thumbnail-16x9-cm-chandrababu.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 9:39 PM IST
CM Chandrababu Meet With Eknath Shinde In Mumbai: ముంబయి పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందేతో భేటీ అయ్యారు. ముకేష్ అంబానీ ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు శనివారం చంద్రబాబు హాజరయ్యారు. శిందే ఆహ్వానం మేరకు చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లారు. సీఎంకు సాదర స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక వసతుల అభివృద్ధి, పలు ఆర్థిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇద్దరు సీఎంల మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీకి సంబంధించిన ఫొటోలను సీఎం ఏక్‌నాథ్ శిందే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.
ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారం ద్వారా అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు శిందే పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి దాదా భుసే, శిందే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ శిందే ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ రంగంలో అవకాశాల విస్తరణ తదితర అంశాలపైనా చర్చించినట్లు సమాచారం.