సామాన్య కార్యకర్తలకు గుర్తింపు - సచివాలయానికి పిలిపించి మాట్లాడిన చంద్రబాబు - CBN Met Activists in sachivalayam - CBN MET ACTIVISTS IN SACHIVALAYAM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 6:56 AM IST

CM Chandrababu Met Activists Selflessly Working For Party: తెలుగుదేశం పార్టీకి నిస్వార్థంగా సేవ చేస్తూ, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్‌లతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్‌కు వారిని పిలిపించుకొని మాట్లాడారు. గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచినప్పుడు కొన్ని రోజులపాటు వారు అక్కడే ఉన్నారు. ఆయన విడుదల అయ్యాక సంబరాలు చేసుకున్నారు. వారి కుటుంబ నేపథ్యం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వారితో ఫొటోలు దిగారు. 

చంద్రబాబు చూపిన ఆప్యాయత, సామాన్య కార్యకర్తలైన తమను గుర్తించిన తీరుతో దుర్గాదేవి, శివరాజు యాదవ్‌లు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అధినేతతో మాట్లాడంపై వారు ఇద్దరు సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరూ చంద్రబాబు పర్యటనల్ని ముందుగా తెలుసుకొని ఎంత దూరమైనా వ్యయ ప్రయాసల కోర్చి అక్కడకు వెళ్లేవారు. దుర్గాదేవి తన స్కూటీపై చంద్రబాబు ర్యాలీల్లో ఉత్సాహంగా పాల్గొనే వారు. కార్యకర్తలకు చంద్రబాబు ఇచ్చే ప్రాధాన్యతకు ఇదో మచ్చుతునకని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.