LIVE: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం - ప్రత్యక్ష ప్రసారం - SWARNANDHRA 2047 VISION PROGRAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2024, 10:59 AM IST
|Updated : Dec 13, 2024, 2:22 PM IST
Swarnandhra 2047 Vision Document Program: అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర- 2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు నేడు ప్రజల ఎదుట ఆవిష్కరిస్తున్నారు. పది సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా కార్యక్రమం జరుగుతోంది. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు అన్నదాతల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామనే హామీని సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో ఇస్తారు. 2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఏపీ నంబర్ 1 కావాలనే లక్ష్యం ఈ డాక్యుమెంట్‌ని రూపొందించారు. విజన్ డాక్యుమెంట్‌పై తొలి ప్రసంగం సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ చేస్తారు. ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాలను సీఎం చంద్రబాబు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగుతున్న బహిరంగ సభలో ప్రజల ముందు ఉంచుతారు. ప్రజలూ తమ కుటుంబం 2047 ఏడాది నాటికి ఎలా ఉండాలో ఒక ఆలోచన చేయాలని చేయాలని, ప్రతి ఒక్కరూ తమ విజన్ తయారు చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో కోరనున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Dec 13, 2024, 2:22 PM IST