మెగా డీఎస్పీ జీవో వచ్చేసింది- స్కిల్ సెన్స్ -2024 ఉత్తర్వులు సైతం జారీ చేసిన సీఎస్ - MEGA DSC GO - MEGA DSC GO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 10:09 AM IST
GO Released On Mega DSC : ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు పెట్టిన వెంటనే హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డీఎస్పీపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 16 వేల 347 పోస్టుల భర్తీకి ఆదేశాలు వెలువడ్డాయి. డిసెంబర్ 31 నాటి కల్లా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
స్కిల్ సెన్స్-2024ను చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా యువతలోని నైపుణ్యం ఏ మేరకు ఉందన్న వివరాలు సేకరించాలని ఆదేశాల్లో పేర్కొంది. వివిధ వర్గాల్లోని యువతకు ఉన్న నైపుణ్యం ఏ మేరకు నైపుణ్యం అవసరమనే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించింది. నైపుణ్య గణనకు నోడల్ ఏజెన్సీగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. స్కిల్ సెన్సస్‌కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.