Live: విజయవాడలో పోలీసుల అమరుల సంస్మరణ దినోత్సవం - హాజరైన సీఎం చంద్రబాబు - POLICE COMMEMORATION DAY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2024, 8:37 AM IST
|Updated : Oct 21, 2024, 9:51 AM IST
CM Chandrababu Attended Police Commemoration Day in Vijayawada Live : శాంతి భద్రతలు, ప్రజల రక్షణకు రాత్రింబవళ్లు పనిచేసేది పోలీసులే. ప్రజలంతా హాయిగా నిద్రపోతుంటే వారు గస్తీ కాస్తుంటారు. అందరూ పండగ చేసుకుంటే వారు బందోబస్తులో తలమునకలుగా ఉంటారు. అలాంటి పోలీసులు విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు కూడా చేశారు. అలాంటి పోలీసుల సేవలు, త్యాగాలను గుర్తు చేసుకుని వారికి నివాళి అర్పించేందుకు ఏటా అక్టోబర్ 21న ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో పోలీసుల అమరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.గొడవలు, కుమ్ములాటలు, అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, శాంతి భద్రతలు, వీఐపీల రాకపోకలు బహిరంగ సభలు, సమావేశాలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు పండగలు, ప్రత్యేక వేడుకలు ట్రాఫిక్ నియంత్రణ, అర్ధరాత్రి గస్తీ ఇలా రకరకాల విధులు, ఒత్తిళ్లతో పోలీసులు నలిగిపోతున్నారు. ప్రజారక్షణలో అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతల్లో వెసులుబాటు, ప్రయోజనాలు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కరుణించి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Last Updated : Oct 21, 2024, 9:51 AM IST