ప్రోటోకాల్​పై వైసీపీ,సమస్యలపై టీడీపీ- రసాబాసగా GMC COUNCIL MEETING - Clash Between YCP TDP Corporators - CLASH BETWEEN YCP TDP CORPORATORS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 4:39 PM IST

Clash Between YSRCP and TDP Corporators : గుంటూరు నగరపాలక సంస్థ పాలక మండలి సమావేశం వైఎస్సార్సీపీ, టీడీపీ కార్పోరేటర్ల మధ్య వాగ్వాదానికి వేదికైంది. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని వైఎస్సార్సీపీ సభ్యులు సమావేశంలో నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులను ఈ సమావేశంలో సన్మానించారు. 

గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కో ఆప్షన్ సభ్యులుగా ప్రకటించారు. నగరంలో తాగునీటి సమస్య, కొత్త రిజర్వాయర్లు పైపులైన్ల నిర్మాణం ఆలస్యం కావడంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే భూగర్భ డ్రైనేజి పనులు నిలిచిపోవటంపైనా టీడీపీ, వైఎస్సార్సీపీ సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. నీటి సమస్య తీర్చేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సూచించారు. నగరపాలక సంస్థకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వానికే వెళ్తోందని,  ఈ విధానం మార్చి నిధులు స్థానికంగా వినియోగిస్తే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్వోబీలు, ఆర్​యుబీలు నిర్మించటంపై దృష్టి సారించాలని సూచించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.