శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం : కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు - Ram Mohan on Srikakulam Airport - RAM MOHAN ON SRIKAKULAM AIRPORT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2024, 7:19 PM IST
Ram Mohan on Srikakulam Airport : ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ మంజూరుకు కృషి చేస్తానని వివరించారు. పాతపట్నంలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Ram Mohan Naidu Visit Pathapatnam : అంతకుముందు రామ్మోహన్ నాయుడు పాతపట్నంలో ప్రధానమంత్రి జన్మన్ వసతిగృహానికి మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. వెనుకబడిన ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధి చేసేందుకు ఐటీఐ కళాశాలను మంజూరు చేయనున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అలాగే పాతపట్నం సామాజిక ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో గతంలో ప్రారంభించిన మూడు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుకు గురైన పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాడి గోవిందరావు , కలెక్టర్ స్వప్నల్ దినకర్, తదితరులు పాల్గొన్నారు.