LIVE: రాష్ట్ర అభివృద్ధిపై 'సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ' చర్చ - ప్రత్యక్ష ప్రసారం - Citizens for Democracy Meeting - CITIZENS FOR DEMOCRACY MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 11:41 AM IST
|Updated : Apr 15, 2024, 12:54 PM IST
Citizens for Democracy Meeting Live: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లోంచి పక్కన పెట్టాలన్నారు. పింఛన్, రేషన్‌తో పాటు పౌరులతో వాలంటీర్లను దూరం చేస్తేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయన్నారు. ఓటర్లు చైతన్యంగా, నిర్భయంగా బయటికి వచ్చి తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. విజయవాడలో ప్రజాస్వామ్యం-ఓటు హక్కు ప్రాధాన్యతపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు పాల్గొని ఓటుకు ఉన్న ప్రాధాన్యతపై వారి అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఓటు హక్కు ప్రాధాన్యతపై వక్తలు ప్రసంగించారు. రానున్న ఎన్నికలు హింసాయుత వాతావరణంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. పోలీసులు దేశ ప్రధాని భద్రతనే విస్మరిస్తే సామాన్య ప్రజలకు రక్షణ ఎవరు? అని ప్రశ్నించుకోవాల్సి అవసరం ఉందన్నారు. కాగా ఆంధ్రప్రేదశ్ అభివృద్ధిపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యలో చర్చా గోష్టి ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.
Last Updated : Apr 15, 2024, 12:54 PM IST