LIVE: విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - CFD conference
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 11:03 AM IST
|Updated : Feb 4, 2024, 12:46 PM IST
Citizens for Democracy Meeting: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత నడుం బిగించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ(CFD) సంస్థ పిలుపునిచ్చింది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘ఓటు వేద్దాం- ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేద్దాం’ అనే నినాదంతో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నారు. ‘యువత భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని, పట్టణ ఓటర్లలో ఎన్నికలపై అనాసక్తిని పోగొట్టాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తెలిపింది. ఓటు వేయడమే కాదని, రాజ్యాంగ వ్యవస్థలు, విలువలు కాపాడుకునేలా కృషి చేయాల్సిన బాధ్యత కూడా యువతదే అని పేర్కొంది.
ఓటుహక్కు వినియోగించుకోకపోవడం వల్లే ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని, పౌరులు క్రియాశీలకంగా మారి తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. స్థానిక సంస్థలు బలహీనపడితే మిగతా వ్యవస్థలూ బలహీనం అవుతాయని పేర్కొంటున్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికల అమలుకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏర్పాటైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పాడుపడుతోంది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని తెలుపుతున్నారు. ప్రస్తుతం విజయవాడలో జరుగుతోన్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.