LIVE : హైదరాబాద్లో సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు - undefined
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-01-2024/640-480-20589302-thumbnail-16x9-mantri.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 25, 2024, 12:13 PM IST
|Updated : Jan 25, 2024, 12:18 PM IST
హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసిన సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సును ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వ విజన్ రాబోయే ఐదేళ్లే కాదని, రాష్ట్ర ప్రగతే తమ విజన్ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రగతి పనులను ఎక్కడా ఆపమన్న ఆయన, రాజీవ్ గాంధీ కన్న కలలు ముందుకు తీసుకెళ్లేందుకు పీవీ లిబరేషన్ మొదలుపెట్టారని చెప్పారు. రాష్ట్రంలో ఎకో సిస్టమ్ గత పదేళ్లలో చేసింది కాదని, మూడు దశాబ్దాల్లో స్థిరాస్తి రంగం ఎంతో పుంజుకుందని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి తమకు అవకాశం వచ్చిందన్న మంత్రి, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ క్రమంలోనే దావోస్ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధే కాకుండా మౌలిక వసతులపైనా చర్చించామని చెప్పారు. సుస్థిరమైన విధానంలో స్థిరాస్తి రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామిక వేత్తల సహకారం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
TAGGED:
infra real estate conference