చిరు ఇంటి దగ్గర ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ - ప్రముఖుల సందడి - Padma Vibhushan To Chiranjeevi
🎬 Watch Now: Feature Video
Published : Jan 26, 2024, 7:57 PM IST
Chiranjeevi Padma Vibhushan Award Celebrations : మెగాస్టార్ చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ రావడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి చిరంజీవిని అభినందనలతో ముంచెత్తారు. సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్‌రాజు, సినీగేయ రచయిత చంద్రబోస్, దర్శకులు గుణశేఖర్, మారుతి, బాబీ, బుచ్చిబాబు, వశిష్ట, సీనియర్ నటులు మురళీమోహన్, ఉత్తేజ్ సహా పలువురు నిర్మాతలు చిరంజీవి నివాసానికి చేరుకొని పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. మేనల్లుడు, నటుడు అల్లు అర్జున్ కుటుంబసమేతంగా హాజరై చిరంజీవికి అభినందనలు తెలిపారు. వరుణ్ తేజ్ దంపతులు, సాయిధరమ్ తేజ్ సహా మరికొంత మంది కుటుంబసభ్యులు, సన్నిహితులు చిరు నివాసానికి చేరుకొని సందడి చేశారు. ఈ సందర్భంగా త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చిరంజీవికి పౌర సన్మానం చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అలాగే చిత్ర పరిశ్రమ తరఫున కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు దిల్ రాజు వెల్లడించారు.