LIVE: అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CBN White Paper on Amaravati - CBN WHITE PAPER ON AMARAVATI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 3:07 PM IST
|Updated : Jul 3, 2024, 4:18 PM IST
Chandrababu White Paper Release on Capital Amaravati Live: గత ప్రభుత్వ మూడు రాజధానుల వివాదాస్పద నిర్ణయంతో ధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ దానిపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. అధికారంలోకి రాగానే స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న సీఎం దీనిపై ప్రజల్లో చర్చ జరగాలన్న లక్ష్యంతో ఈ శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశా నిర్దేశం చేసేలా ఈ శ్వేతపత్రం ఉండే అవకాశం ఉంది.మూడు రాజధానుల వివాదాస్పద నిర్ణయం తో గత ప్రభుత్వం అమరావతి నిర్మాణం నిలిపివేసింది. దీంతో గడచిన ఐదేళ్ల కాలంలో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. టీడీపీ హయాంలో దాదాపు 9 వేల కోట్ల రూపాయల వ్యయం తో చేసిన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. రాజధాని ప్రాంతంలో 2014-19 మధ్య అప్పటి ప్రభుత్వం నిర్మించిన రాష్ట్ర సచివాలయం, ఏపీ హైకోర్టు మినహా మరే కార్యాలయం ప్రస్తుతం రాజధానిలో పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న చంద్రబాబు ప్రత్యక్షప్రసారం.
Last Updated : Jul 3, 2024, 4:18 PM IST