ETV Bharat / state

8న విశాఖకు ప్రధాని మోదీ - ఏర్పాట్లపై సీఎస్​ సమీక్ష - CS REVIEW ON PM TOUR

విశాఖలో ప్రధాని మోదీ పర్యటనపై అధికారులతో సీఎస్ సమీక్ష - పర్యటనను విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం

CS_Review_On_PM_Tour
CS_Review_On_PM_Tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2025, 10:43 PM IST

CS Vijayanand Review with Officials about PM Modi Tour: ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం కె. విజయానంద్ పేర్కొన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశామని అందుకు అనుగుణంగా ఆయా శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి: ఏర్పాట్లలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ కార్యక్రమం ఖరారై రావాల్సి ఉందని, వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను యుద్దప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం ప్రధాని విశాఖ చేరుకుని సంపత్ వినాయక గుడి నుంచి ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే సభా వేదిక వరకూ రోడ్డు షో నిర్వహించనున్నారని సీఎస్ పేర్కొన్నారు.

ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్డు షోలో పాల్గొనేందుకు పెద్దఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు రానున్నందున వారి వాహనాల పార్కింగ్​కు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సాయంత్రం వేళలో రోడ్డు షో, సభా వేదిక, పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే సమావేశానికి వచ్చే వారికి అల్పాహారం, భోజన వసతి, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సూచించారు.

పెట్టుబడి కంటే ఐడియా ముఖ్యం - తెలుగువాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగాలి: చంద్రబాబు

పర్యటనకు విశాఖపట్నం సహా పరిసర అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి ప్రజలను బస్సులు, ఇతర వాహనాల్లో తరలించనున్నందున వారిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ మోదీ పర్యటనకు సంబంధించి విశాఖ కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా వివిధ శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిరించారు.

22 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్: ప్రధాని పర్యటనకు విశాఖ నగరంలో లక్షా 20వేల మందిని, విశాఖ గ్రామీణ ప్రాంత మండలాల నుంచి 10 వేల మందిని, అనకాపల్లి జిల్లా నుంచి 40 వేల మందిని తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వివరించారు. నగరంలో 22 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు విశాఖ పోలీస్ కమిషనర్ ఎస్.బాగ్చి తెలిపారు. ఈ సమావేశానికి డీజీపీ ద్వారకా తిరుమల రావు, సీయం కార్యదర్శి ప్రద్యుమ్న, ఆర్అండ్​బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణణ్, డా. బిఆర్ అంబేడ్కర్, స్వప్నిల్ దినకర్, ఎస్పీలు, ఇతర అధికాకరులు పాల్గొన్నారు.

పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన: 8వ తేదీన విశాఖలో ప్రధాని పలు ప్రాజెక్టులకు, రైల్వే జోన్​ ఏర్పాటుకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఎన్​టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్​, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్లతో ఏర్పాటు చేసే బల్కు డ్రగ్ పార్కును మోదీ వర్చువల్​గా శంఖుస్థాపన చేయనున్నారు.

రాష్ట్రంలో మరో 7 ఎయిర్‌పోర్టులు - ఎక్కడంటే

పేర్ని నాని గోడౌన్​లో రేషన్ బియ్యం మాయం కేసు - దూకుడు పెంచిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.