Live: ఏపీపీఎస్సీలోని అక్రమాలపై చంద్రబాబు ప్రెస్మీట్- ప్రత్యక్షప్రసారం - Chandrababu on APPSC Irregularities
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 11:11 AM IST
|Updated : Mar 15, 2024, 12:09 PM IST
Chandrababu Press Meet on Irregularities in APPSC Live: రాష్ట్రంలో 5 ఏళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలయ్యిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజ్యాగబద్ధ సంస్థ అయిన సర్వీస్ కమిషన్ (Service Commission)ను కూడా రాజకీయ లబ్ధికి, అక్రమాలకు వేదిక చేసి సీఎం జగన్ రెడ్డి లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆయన మండిపడ్డారు. ఎపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు, కుట్రలకు నిరుద్యోగ యువత బలయ్యిందని అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మునుపెన్నడూ లేని వివాదాలు ఎందుకు తలెత్తాయని, వాటికి కారణాలు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకన అంటూ మోసపూరిత చర్యలతో రాజకీయ మూల్యాంకనానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అక్రమాలకు పాల్పడి సర్వీస్ కమిషన్ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు ప్రెస్మీట్ ప్రత్యక్షప్రసారం.
Last Updated : Mar 15, 2024, 12:09 PM IST