భారీ విజయం దిశగా కూటమి - సంబరాల్లో చంద్రబాబు కుటుంబం - Chandrababu Family Celebration - CHANDRABABU FAMILY CELEBRATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 4, 2024, 4:57 PM IST
Chandrababu Family Celebration: కూటమి ఘన విజయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఘనంగా సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. సంబరాల్లో భాగంగా చంద్రబాబు నాయడుడి కుటుంబంతో పాటుగా నందమూరి బాలకృష్ణ ఫ్యామిలి ఒక్కరినొక్కరు ఆలింగనం చేసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. లోకేశ్ సైతం ఉత్సాహంగా కనిపించారు. కేక్ కట్ చేసిన అనంతరం నారా భువనేశ్వరితో పాటుగా చంద్రబాబుకు లోకేశ్ కేక్ తినిపించారు. ఇక చంద్రబాబు ఇంటి ముందు తెలుగుదేశం అభిమానులు బారులు తీరారు. చంద్రబాబు నాయుడి ఇంటి పరిసరాలు మెుత్తం జై బాబు, సీఎం అంటూ నినాదాలు చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సునామీ సృష్టిస్తోంది. కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ విలవిల్లాడుతుండగా కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కూటమి అభ్యర్థులు జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేస్తున్న తరుణంలో జగన్ మినహా మంత్రులంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు.