అబద్ధాల్లో జగన్‌ పీహెచ్‌డీ చేశారు-ఇలాంటి జలగ మనకు అవసరమా?: చంద్రబాబు - Chandrababu tours

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 5:36 PM IST

Chandrababu Comments in Ra Kadali Ra Meeting: వచ్చే కురుక్షేత్ర యుద్ధానికి తాము సిద్ధమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో రా కదలి రా బహిరంగసభలో మాట్లాడిన ఆయన జగన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందన్నారు. ప్రజాకోర్టులో వైసీపీను శిక్షించే సమయం దగ్గరపడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాయలసీమకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని సవాల్ చేశారు. ప్రాజెక్టుల మరమ్మతులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతామంటే ఎలా నమ్ముతారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

సీఎం జగన్‌ ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అబద్ధాల్లో జగన్‌ పీహెచ్‌డీ చేశారన్నారు. నా పాలనలో పన్నుల వాత లేదు అప్పుల మోత లేదు కాని జగన్ వచ్చాక అంతా పెరిగిపోయిందన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్‌ రాజకీయ వ్యాపారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మద్యం విక్రయాలపై డిజిటల్‌ చెల్లింపులు ఎందుకు లేవు మద్యంపై ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్‌లో లెక్కేసుకోవడమే జగన్‌ పని అని చంద్రబాబు అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.