LIVE: పెడనలో చంద్రబాబు, పవన్​కల్యాణ్​ల బహిరంగ సభ- ప్రత్యక్షప్రసారం - Chandrababu Pawan Kalyan Prajagalam - CHANDRABABU PAWAN KALYAN PRAJAGALAM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 6:13 PM IST

Updated : Apr 17, 2024, 7:34 PM IST

Chandrababu and Pawan Kalyan Public Meeting in Pedana Live: ఎన్నికల వేళ కూటమి నేతలతోపాటు పార్టీల అధినేతలు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళంతో అనేక నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్​ షోలలో పాల్గొంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు గోదావరి జిల్లాల్లో ఉమ్మడిగా ప్రచారం చేసి కూటమి శ్రేణుల్లో జోష్‌ నింపిన నారా చంద్రబాబు ( Nara Chandrababu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఇవాళ కృష్ణా జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతల అరచకాలు, అక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.ప్రజాగళంలో భాగంగా నేడు పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఇరుపార్టీల అధినేతలు కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. తొలి దశ ప్రచారంలో భాగంగా తణుకు, నిడదవోలు, పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోనూ కొనసాగుతుందని కూటమి శ్రేణులు భావిస్తున్నారు. తమ అభిమాన నాయకులను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున సభలకు హజరవుతున్నారు.
Last Updated : Apr 17, 2024, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.