వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు - చంద్రప్రభ వాహనంపై విహరించిన మలయప్ప స్వామి - CHANDRA PRABHA VAHANAM IN TIRUMALA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2024, 10:31 PM IST
Chandra Prabha Vahanam in Tirumala Brahmotsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై వివిధ రకాల వేషధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్పస్వామి రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దర్భార్ కృష్ణుడి అలంకారంతో విశేష తిరువాభరణాలు ధరించి స్వామివారు చల్లని వెన్నెల్లో చంద్రప్రభ వాహనంపై విహరించారు. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. వాహనం ముందు కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. శుక్రవారంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకోనున్నాయి. ఉదయం 7 గంటలకు రధోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంతో సేవతో స్వామివారి వాహన సేవలు ముగిస్తాయి.
8వ రోజు ప్రాత కాల సమయాన మహారథం: బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడు రోజుల పాటు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి 8వ రోజు ప్రాత కాల సమయాన మహారథం అధిష్టించనున్నారు. ధారు రథంపై శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామి వారు దర్శనమివ్వనున్నారు. అనేకమైన వర్ణవస్త్రాలు, తోరణాలు, శిల్పాలు, పుష్పమాలలు, బంగారు కలశం, బంగారు గొడుగుతో ఈ మహారథాన్ని అలంకరిస్తారు.