ముగ్గు వేస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ - సీసీటీవీలో దృశ్యాలు - Chain Snatching in Mangalagiri - CHAIN SNATCHING IN MANGALAGIRI
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 22, 2024, 6:51 PM IST
Chain Snatching in Mangalagiri : గుంటూరు జిల్లాలో వరుస చోరీలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా వీరి ఆగడాలు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. దీంతో దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్లు సాగుతుంది వీరి వ్యవహారం. గత రెండు రోజులుగా మంగళగిరిలోని ఎంఎస్ఎస్ నగర్లో మూడు గొలుసు దొంగతనాలు జరిగాయి.
Chain Snatching Case in Guntur District : తాజాగా ఇవాళ ఉదయం ఆరుబయట ముగ్గు వేస్తున్న ఓ మహిళ మెడలో నుంచి ఓ దుండగుడు గొలుసు లాక్కొని ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు అత్యాధునిక ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నారని పోలీసులు అంటున్నారు. వాటికి నంబర్ ప్లేట్లు తొలగించి చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. దీంతో వీరిని గుర్తించడం కష్టంగా మారిందని అంటున్నారు. త్వరలోనే గొలుసు దొంగలను పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.