ప్రభుత్వ పథకాల నిధులు లబ్ధి దారుల ఖాతాల్లో చేరలేదు : సీఎఫ్డీ వల్లంరెడ్డి - CFD Vallamreddy Lakshmana Reddy - CFD VALLAMREDDY LAKSHMANA REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 17, 2024, 10:43 AM IST
CFD Vallamreddy Lakshmana Reddy Comments on DBT Scheme Funds : ఎన్నికల ముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) జవహర్ రెడ్డి హడావిడి చేసి నేడు లబ్ధిదారులకు ఎందుకు పథకాలు లబ్ధి చేకూర్చటంలేదని సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ (CFD) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. గుంటూరులో సీఎఫ్ నాయకులు సమావేశమయ్యారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి నాలుగు రోజులు అవుతున్నా ప్రభుత్వ పథకాల నిధులు లబ్ధి దారుల ఖాతాల్లో చేరలేదని మండిపడ్డాడు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని లబ్ధిదారులకు నిధులను చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదవడం ఇదే మెుదటిసారని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. పలుచోట్ల చెదురుముదురు సంఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. ఒక్క ప్రాంతాల్లో కూడా రీపోలింగ్ జరగాల్సిన అవసరం రాలేదన్నారు. అయితే ఎన్నికల అనంతరం చంద్రగిరి, మాచర్ల, గురజాల, తాడిపత్రి ప్రాంతాలలో జరుగుతున్న ఘర్షణలను నివారించడంలో పోలీసు యంత్రాంగం విఫలం అయిందన్నారు. ఓటింగ్ శాతం పెరగటానికి సీఎఫ్డీ గత 6 నెలలుగా చేసిన కృషి ఫలించిందన్నారు.