తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రధాని నిధులు మంజూరు చేయడం హర్షనీయం : కిషన్ రెడ్డి - Kishan reddy hyderabad news
🎬 Watch Now: Feature Video
Published : Mar 7, 2024, 5:00 PM IST
Central Minister Kishan reddy At Amerpet : దేవాలయాల అభివృద్ధి కొరకు ప్రధాని నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమీర్‌పేట్ బాల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద జరిగిన కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా వేలకోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలను ప్రధాని మోదీ వర్చవల్‌గా ప్రారంభించారు. ఇందులో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో రూ.4.4 కోట్ల నిధులతో వివిధ సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. అమీర్‌పేట్‌లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
Kishan reddy : ఈ ప్రాజెక్టులో భాగంగా దేవస్థానంలో అన్నదానం భవనం, వర్షపునీటి సంరక్షణ వసతులు వరదనీటి డ్రైనేజ్ వ్యవస్థ బయో టాయిలెట్స్ కాంపౌండ్ వాల్స్, గేట్లు సీసీటీవీలు, సైనేజెస్, వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. వారందరికీ ఈ కొత్త ప్రాజెక్టు త్వరలో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ టూరిజంకు తెలంగాణకు దేశ ప్రధాని రూ. 137 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షనీయమని జూపల్లి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కొరకు మరిన్ని నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉందని కిషన్ రెడ్డి కొనియాడారు.