అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు - ఇద్దరు వ్యక్తులు 'సేఫ్' - Car Accident At Sangareddy - CAR ACCIDENT AT SANGAREDDY
🎬 Watch Now: Feature Video
Published : Jul 28, 2024, 5:32 PM IST
Car Accident At Sangareddy : రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు అప్రమత్తపై కారులో ఉన్న వారిని కాపాడటంతో ప్రాణాప్రాయం తప్పింది.
ఇదీ జరిగింది : నిజాంపేట్ మండలం మునిగేపల్లి శివారు ప్రాంతంలో ఓ కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. కాలువ నిండా నీళ్లు ఉండటంతో కారు బురదలో కూరుకుపోయింది. కారు డోర్లు మూసుకుపోయాయి. వాహనం లోపల ఉన్న వ్యక్తులు బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ అవకాశం లేకుండాపోయింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయ స్థితినుంచి తప్పించుకున్నారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి కారు లోపల ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. అద్దాలు మూసుకుపోవడంతో కారులోపల మొత్తం పొగ అలుముకుంది. వారిని కాపాడే ప్రక్రియ ఏమాత్రం ఆలస్యమైనా రెండు ప్రాణాలు పోయేవి. వారిద్దరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు పొలంలోకి దూసుకుపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.