రాజధానిలో మొదలైన పనులు - గ్రామదేవతలకు అమరావతి రైతుల మెుక్కులు - Capital Farmers
🎬 Watch Now: Feature Video
Capital Farmers Prayers to Village Deities in Guntur : గుంటూరు జిల్లా మందండంలో గ్రామదేవతలకు రాజధాని రైతులు, మహిళలు మెుక్కులు చెల్లించుకున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాజధానిలో పనులు ప్రారంభం కావడంతో మహిళలు గ్రామదేవతలకు మొక్కులు చెల్లించారు. తొలుత వినాయక స్వామి ఆలయంలో 1116 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి చెట్టుకి, పోలేరమ్మకు పూజలు చేసి సారెను సమర్పించారు. దారి పొడవునా చీరలు పరిచి అమ్మవారి పానకం కావడని ఊరేగించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రామణ్ పాల్లొన్నారు. దేవతల ఆశీస్సులతో త్వరలోనే రాజధాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గతంలో అమరావతే రాజధానిగా ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నామని మహిళలు పేర్కొన్నారు. అమ్మవారి దయతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో విజయం సాధించిందని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెంది, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలియజేశారు.