ఆకతాయిలకు భయపడి బావిలో పడ్డ ఒంటె- 3గంటలు శ్రమించి సేఫ్గా బయటకు - CAMEL RESCUED IN Bihar - CAMEL RESCUED IN BIHAR
🎬 Watch Now: Feature Video
Published : Apr 13, 2024, 1:07 PM IST
Camel Fell Into Well In Bihar : బిహార్ పట్నాలోని గురు కే బాగ్ ప్రాంతంలో ఓ ఒంటే ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దీంతో పెద్ద సంఖ్యలో గుమిగూడిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సుమారు మూడు గంటల పాటు శ్రమించి జేసీబీ సహాయంతో ఒంటెను సురక్షితంగా బయటకు తీశారు.
గ్రామంలో జరుగుతున్న ఓ మతపరమైన కార్యక్రమం (నాగర్కీర్తన్)లో పాల్గొనేందుకు ఏనుగు, గుర్రాలు, ఒంటెలను తీసుకువచ్చారు వాటి యజమానులు. వాటిని గురు కే బాగ్లోని ఓ తోటలో ఆహారం కోసం వదిలేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు ఆకతాయి యువకులు ఒంటెను బెదిరించారు. వీరిని చూసి బెదిరిపోయిన ఒంటె అక్కడి నుంచి మెల్లగా నెనుకకు అడుగులు వేసుకుంటూ తోటలోని ఉన్న ఓ బావి వద్దకు చేరుకుంది. అనంతరం అదుపు తప్పి బావిలో పడిపోయింది. దీంతో సదరు యువకులు భయంతో గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. వీరు పోలీసులకు తెలిపారు. 'జేసీబీ సాయంతో బావిలో పడ్డ ఒంటెను సురక్షితంగా బయటకు తీయగలిగాము. అదృష్టవశాత్తు ఒంటెకు ఎలాంటి గాయాలు కాలేదు' అని ఓ పోలీసు అధికారి తెలిపారు.