జాతీయ రహదారిపై అదుపు తప్పిన బస్సు- పది మందికి తీవ్ర గాయాలు - BUS ACCIDENT ON NATIONAL HIGHWAY - BUS ACCIDENT ON NATIONAL HIGHWAY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 12:21 PM IST

Bus accident on national highway:  అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లివద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై, ప్రైవేట్‌ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు డివైడర్‌ను ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి (ten people seriously injured). ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు హైవే పెట్రోలింగ్ సిబ్బంధికి సమాచారం అందించారు. ప్రమాద విషయం తెసుకున్న హైవే సిబ్బదింది ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. 

క్షతగాత్రుల్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి (Govt hospital) కి తరలించారు. మిగతా ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. డ్రైవర్  అతివేగంతో బస్సును నడుపుతున్న సమయంలో అదుపుచేయలేక డివైడర్‌ను ఢీకొనడంతో పొలాల్లోకి దూసుకెళ్లినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా ఇతర కారణాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.