ఆర్టీసీ బస్సు బోల్తా - స్టీరింగ్ పనిచేయకపోవడంతో గుంతల్లోకి దూసుకెళ్లిన బస్సు - Bus accident in Sathyasai district - BUS ACCIDENT IN SATHYASAI DISTRICT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 8:00 PM IST
Bus Accident in Sri Sathyasai District : శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అనంతపురం నుంచి హిందూపురానికి ఈరోజు మధ్యహ్నం 23 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. మామిళ్లపల్లి వద్దకు రాగానే ఉన్నట్టుండి బస్సు స్టీరింగ్ పనిచేయలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక బస్సు డ్రైవర్ అయోమయానికి గురయ్యారు.
People Injuring from Bus Accident : చివరికి బస్సును డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో పక్కనే ఉన్న గుంతల్లోకి వెల్లింది. దీంతో ఒక్కసారిగా భయందోళనకు గురైన ప్రయాణికులు అర్థనాదాలు చేశారు. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు.