పీవీ కుటుంబ సభ్యులకు జగన్ క్షమాపణలు చెప్పాలి: బుద్ధా వెంకన్న - Buddha Venkanna on Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 5:01 PM IST
Buddha Venkanna Allegations on CM Jagan: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) కుటుంబ సభ్యులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. పీవీ నరసింహరావుకు భారతరత్న రావటంపై జగన్ స్పందించకపోవటం అన్యాయమన్నారు. ఎన్నో స్కాములు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) పీవీ నరసింహారావు గురించి మాట్లాడితే ఆయన అపవిత్రమవుతారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు.
చంద్రబాబు దిల్లీ వెళ్లటంతో సీఎం జగన్‌కు వెన్నులో వణుకు మెుదలైంది అందుకే జగన్ కూడా దిల్లీ వెళ్లారన్నారు. మోదీతో మాట్లాడాక జగన్‌కు మతిపోయిందని విమర్శించారు. పీవీ నరసింహరావుకు భారతరత్న రావటంపై జగన్ స్పందనను మీడియా కోరితే మాట్లాడలేదని బుద్ధా వెంకన్న విమర్శించారు. తెలుగుదేశంలో టికెట్ల కోసం పదిమంది పోటీ పడుతుంటే వైసీపీలో టికెట్లు అడిగే వారేలేరని ఆక్షేపించారు. తెలుగువేశం పార్టీలో ఎవరైనా టిక్కెట్టు రాలేదని చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.