LIVE : మహిళా కమిషన్​ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్ - బుద్ధ భవన్ వద్ద ఉద్రిక్తత - brs mla KTR Press Meet - BRS MLA KTR PRESS MEET

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 11:52 AM IST

Updated : Aug 24, 2024, 1:07 PM IST

BRS Working President KTR Press Meet : మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్​ సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. నేడు విచారణకు రావాలని రాష్ట్ర మహిళా కమిషన్​ ఆదేశించింది. ఈమేరకు మహిళా కమిషన్​ ఎదుట కేటీఆర్ విచారణకు​ హాజరయ్యారు. అనంతరం విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ముందుగా తెలంగాణ భవన్​ నుంచి కేటీఆర్​ రాష్ట్ర మహిళా కమిషన్​కు బయలుదేరి వెళ్లారు. కేటీఆర్​ వెంట బీఆర్​ఎస్​ మహిళా ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు. కాంగ్రెస్​ సర్కార్​ ఏర్పడిన ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని ఘటనల వివరాలు కమిషన్​ తెలియజేశానని చెప్పారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని అన్నారు. మహిళ ఫ్రీ బస్సుపై మాట్లాడిన కేటీఆర్​ వ్యాఖ్యలపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధమే జరిగింది. తాజాగా కేటీఆర్ మహిళా కమిషన్​ ఎదుట విచారణకు హాజరుకాగా, ఇరు పార్టీల కార్యకర్తలు భారీగా బుద్ధ భవన్​ వద్దకు చేరుకున్నారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Last Updated : Aug 24, 2024, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.