సీఎం రేవంత్‌ను కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే - అసలేం జరుగుతోంది? - రేవంత్‌ను కలిసిన బీర్ఎస్ ఎమ్మెల్యే
🎬 Watch Now: Feature Video


Published : Jan 28, 2024, 9:15 PM IST
BRS MLA Prakash Goud Meet CM Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. తన నియోజకవర్గమైన రాజేంద్రనగర్‌లోని శంషాబాద్ మండలం కొత్వల్గూడా, బహదూర్ గూడా, ఘన్సిమియాగూడా గ్రామాల్లో గల భూ సమస్యల పరిష్కారం కోసం సీఎంను కలిసినట్లు ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు.
BRS Political News : అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా, శనివారం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు. ఇదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవలే రేవంత్‌ను కలవటం, దానిపై పెద్ద రాజకీయ దుమారం చెలరేగటం తెలిసిందే.