40 రోజులు నా కోసం పని చేయండి - గెలిస్తే 5 ఏళ్లు మీ వెంటే ఉంటా : వెంకట్రామి రెడ్డి - BRS Meeting in Medak - BRS MEETING IN MEDAK
🎬 Watch Now: Feature Video
Published : Mar 31, 2024, 6:23 PM IST
BRS Medak MP Candidate Venkata Ramireddy Meeting : తాను గెలిస్తే సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సభలో మాట్లాడిన ఆయన 2021లో ప్రజా సేవ కోసం కలెక్టర్ పదవిని వదిలి కేసీఆర్, హరీశ్‌రావుల ప్రోత్సాహంతో ఎమ్మెల్సీగా అవకాశం తీసుకుని ప్రజా సేవలో ఉన్నట్లు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే 40 రోజులు తన కోసం పని చేయాలని, మిగతా 5 ఏళ్లు ప్రజల వెంటే ఉంటానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలవడం బాధాకరం అన్నారు. ఎంపీగా తనను గెలిపిస్తే, ఎమ్మెల్యే లేని లోటు తీర్చుకుందామని కార్యకర్తలకు తెలిపారు. మెదక్ నియోజకవర్గంతో తనకు 11 ఏళ్లుగా అనుబందం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఒక అధికారిగా, ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చానని, అందరూ ఆశీర్వదించి గెలిపించారని కోరారు.