కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తోంది : జగదీశ్ రెడ్డి - JAGADEESH REDDY Fires On Congress - JAGADEESH REDDY FIRES ON CONGRESS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-07-2024/640-480-22068234-thumbnail-16x9-jagadessh1.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jul 28, 2024, 5:09 PM IST
Jagadeesh Reddy Fires On CM Revanth : కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు, అబద్దాలతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వాటితోనే పాలన సాగిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి అనే పేరు అబద్దానికి పర్యాయ పదంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ మెడపై కత్తిపెట్టి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమన్నా కేసీఆర్ ఒప్పుకోలేదని వెల్లడించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్‌లో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీలో సభను ప్రజలను రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టించారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సీఎం చదివిన పేపర్ అబద్దమని అది ఉదయ్ పధకానికి చెందినదని వివరణ ఇచ్చారు.ఉదయ్‌కు సంబంధించిన పేపర్లోని వాక్యాన్ని కొంత మింగి కొంతే చెప్పారన్నారు. రేవంత్ దిగజారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే విద్యుత్ వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.