తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీశ్‌రావు - తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు సూచన - Harish Rao Visit Crop Damage
🎬 Watch Now: Feature Video
Harish Rao Visit Crop Damage Farmers : రైతులు తొందరపడి తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకోవద్దని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. అధికారులతో మాట్లాడిన ఆయన, అన్నదాతలకు మద్దతు ధర దక్కేలా చూడటం సహా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. రూ.2 లక్షల రుణమాఫీ, బోనస్ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ గాలికొదిలేసిందని విమర్శించారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా, ప్రభుత్వం నుంచి స్పందన లేదని దుయ్యబట్టారు. రూ.500 బోనస్ కాదు కదా, కనీస మద్దతు ధర కూడా లేదని విమర్శించారు.
BRS Leader Harish Rao Demands to Congress Govt : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. 15 రోజులుగా ఉంటున్నా కొనుగోళ్లు చేయడం లేదని రైతులు హరీశ్‌రావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.