LIVE : సిద్దిపేటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో - ప్రత్యక్షప్రసారం - KCR Election Campaign Live - KCR ELECTION CAMPAIGN LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 10, 2024, 6:55 PM IST
|Updated : May 10, 2024, 9:42 PM IST
BRS Chief KCR Election Campaign In Siricilla Live : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచ్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. కేసీఆర్ సిరిసిల్ల వచ్చిన సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అధికార కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రావడంతో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ సారి అలాంటి అవకాశం ఇవ్వరాదని కోరుతున్నారు.
Last Updated : May 10, 2024, 9:42 PM IST