LIVE : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ కొవ్వొత్తుల ర్యాలీ - BRS candle Rally Live - BRS CANDLE RALLY LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jun 1, 2024, 6:53 PM IST
|Updated : Jun 1, 2024, 8:08 PM IST
BRS Celebrate Telangana Decade Celebrations 2024 Live : తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగుతోన్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళి అర్పిస్తూ ఇవాళ గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు, వివిధ వర్గాల వారు ర్యాలీలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొని ర్యాలీని ముందుకు సాగిస్తున్నారు. కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి ర్యాలీని ప్రారంభించారు. కొవ్వొత్తుల ర్యాలీ చేయడం వల్ల ఆ ప్రాంతమంతా వెలుగులు ఆకర్షవంతంగా మారిపోయింది. ఈ దశాబ్ది ఉత్సవాలను మరో రెండు రోజుల పాటు చేయనున్నారు. ఆదివారం తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనా కార్యక్రమాలు అద్దం పట్టేలా ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు.
Last Updated : Jun 1, 2024, 8:08 PM IST