జగనన్న హయాంలో మరమ్మతులకు నోచుకోని వంతెనలు - ప్రమాదకరమని తెలిసినా కొనసాగుతున్న రాకపోకలు - Pedaparupudi Mandal bridge damage
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-01-2024/640-480-20575416-thumbnail-16x9-bridge-damage-due-to-unrepair-pedaparupudi-mandal.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 4:40 PM IST
Pedaparupudi Mandal Bridge Damage Due To Unrepair: కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడి మండలంలో ప్రధాన రహదారిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఇరువైపుల రక్షణ గోడలు దెబ్బతిని, ఇనుప చువ్వలు బయటకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే వెంట్రప్రగడ, మానికొండ రహదారిపై భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. రహదారిపై గుంతల కారణంగా గుడివాడ - విజయవాడ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. దీంతో ఈ రహదారిపై ప్రయాణమంటే వాహనదారులు హడలిపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా గుడివాడ నుంచి వచ్చే వాహనదారులు యలమర్రు - చినపారుపూడి సమీపంలో ఉన్న వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వంతెన కూలితే వేలాది వాహనాలు 10 నుంచి 20 కిలో మీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెనల పునర్నిర్మాణం, మరమ్మతులపై దృష్టి సారించాలని గ్రామస్థులు, వాహన చోదకులు కోరుతున్నారు.