భారీ వర్షాలకు కూలిన వంతెన- ప్రయాణికులకు తప్పని తిప్పలు - BRIDGE COLLAPSED IN KANDIBANDA - BRIDGE COLLAPSED IN KANDIBANDA
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2024, 3:09 PM IST
Bridge Collapsed in Suryapet : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు నుంచి కోదాడ వెళ్లే ప్రధాన రహదారిలో కందిబండ గ్రామం వద్ద ఉన్న వంతెన కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన కూలిపోవడంతో ఇరువైపుల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనివార్య పరిస్థితిలో కందిబండ గ్రామ రైతులు, విద్యార్థులు, గాంధీనగర్ తండా నుంచి పనులకు వెళ్లే ప్రజలు నిత్యం ఈ ప్రమాదకరమైన మార్గంలో వెళ్లక తప్పడం లేదు.
కూలిన వంతెన శిథిలాలపై నుంచి, వంతెన అంచుల వెంబడి ఓ ఇంటర్నెట్ కేబుల్ ఉంది. దానిని పట్టుకొని ఎక్కుతూ, దిగుతూ నడుచుకుంటూ వెళుతున్నారు. అక్కడి నుంచి జారి పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని కొంత మంది చెబుతున్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి టెండర్ వేసి వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వంతెన పూర్తి కావాలంటే సమయం పడుతుందని దాని కారణంగా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.