యాదాద్రిలో వైభవంగా పదో రోజు బ్రహ్మోత్సవాలు - తరలివచ్చిన భక్తజనులు - Brahmotsavams In Yadadri Temple
🎬 Watch Now: Feature Video


Published : Mar 20, 2024, 7:04 PM IST
Brahmotsavams In Yadadri Temple : గత తొమ్మిది రోజులుగా యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో పదో రోజు యాదాద్రీశునికి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా పూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించారు అర్చకులు. తొలుత లక్ష్మీ సమేత నారసింహుడిని ఆలయ నుంచి కొండపైన విష్ణు పుష్కరిణి వరకు సేవ పై తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం విష్ణు పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని అర్చకులు శాస్రోక్తంగా నిర్వహించారు.
కొండపై విష్ణు పుష్కరణిలో చక్రస్థాన ఘట్టంలో, భక్తులు చక్రతీర్థ స్థానాలు ఆచరించారు. ఆవిధంగా చక్రతీర్థ స్థానం ఘట్టం ముగిసింది. అలాగే ఈనెల 11వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపటి 21వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు యాదాద్రికి తరలి వచ్చారు. ఆ యాదాద్రీశుని సేవలో తరించారు. భక్తులు ఉత్సాహాంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.