ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బొత్స నామినేషన్- కూటమి అభ్యర్థిపై వీడని ఉత్కంఠ - botsa nomination for mlc election - BOTSA NOMINATION FOR MLC ELECTION
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 10:44 PM IST
Botsa Satyanarayana Nomination for MLC Election: విశాఖ కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. బొత్సను బలపరుస్తూ స్థానిక వైసీపీ నేతలు నామినేషన్ దాఖలు చేసే సమయంలో వెంట ఉన్నారు. అనంతరం విశాఖ స్థానిక సంస్థల ఎమ్యెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తాను నిలబడుతున్నట్టు బొత్సా చెప్పారు. ఈ ఎన్నికలో 838 ఓట్లు ఉన్నాయని, ఈ రోజుకి 530 పైగా ఓట్లు వైఎస్సార్సీపీకి ఉన్నాయనని, తమ గెలుపు ఖాయమని బొత్స ధీమా వ్యక్తం చేశారు.
ఒక పారిశ్రామికవేత్తను కూటమి అభ్యర్థిగా పెడుతున్నట్లు తెలుస్తోందన్నారు. కూటమి కనుక అభ్యర్థిని పెడితే అది దుశ్చర్య అవుతుందని అన్నారు. దుష్టులకు దూరంగా ఉంచాలనే క్యాంప్ శిబిరం నిర్వహిస్తున్నామన్నామని బొత్సా చెప్పారు. కూటమి గెలుస్తుందని గట్టిగా చెప్తున్నవారు ఆగష్టు 14 వరకు వేచి ఉండాలని అన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.