ఓటమి భయంతో సానుభూతి కోసమే జగన్​ గులకరాయి దాడి డ్రామా: బొండా ఉమ - bonda uma on jagan stone attack - BONDA UMA ON JAGAN STONE ATTACK

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 1:02 PM IST

Bonda Demand CBI Should Investigate Jagan Attack Incident: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో సీఎం జగన్మోహన్​ రెడ్డి సానుభూతి డ్రామాకు తెరలేపారని బొండా ఉమా తెలిపారు. గులకరాయి డ్రామాలో కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీను పథక రచన చేశారని బొండా అన్నారు. గులకరాయితో కొట్టించుకుని ప్రాణహాని అంటుంటే వైఎస్సార్సీపీ నేతలే నవ్వుతున్నారని బొండా పేర్కొన్నారు. హైసెక్యూరిటీ ఉన్న వ్యక్తి ప్రచారానికి వస్తుంటే ఎందుకు కరెంటు తీశారని ప్రశ్నించారు. కేశినేని నాని, వెల్లంపల్లి కాల్​డేటా వెరిఫై చేయాలని డిమాండ్ చేశారు. గులకరాయి దాడి ప్రీప్లాన్ కాకపోతే సీబీఐ ఎంక్వైరీ వేయాలని బొండా డిమాండ్ చేశారు. 

Bonda Uma Will Meet Governor On Jagan Attack: : జగన్‌పై దాడి ఘటన గురించి సీబీఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. నిజంగా కంటికి గాయమైతే మీడియా సమక్షంలో జగన్‌ ఆస్పత్రికి రావాలన్నారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈరోజు సాయంత్రం గవర్నర్‌ను కలిసి అన్ని విషయాలు చెబుతామని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.