నా సినిమా తప్పక చూడండి - కుమారీ ఆంటీ ఫుడ్​స్టాల్​కు సోనూసూద్ - SONU SOOD VISITS KUMARI AUNTY STALL

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 12:21 PM IST

thumbnail
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్​లో సినీ నటుడు సోనుసూద్​ సందడి (ETV Bharat)

Sonu Sood Meets Kumari Aunty in Hyderabad : కుమారి ఆంటీ, ఇప్పడు భాగ్యనగరంలో పరిచయం అక్కర్లేని పేరు. కేబుల్‌ బ్రిడ్జి దగ్గరలో రోడ్డు పక్కన చిన్న హోటల్‌ స్టాల్‌ను నిర్వహిస్తున్న ఆమె, సామాజిక మాధ్యమం ద్వారా ఎంతో క్రేజ్​ సంపాదించుకుంది. ఆమె హోటల్​ను తెలుగు సినీతారలు కూడా సందర్శించారు. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ హైదరాబాద్​లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశారు. 

కుమారి అంటీకి సోనూసూద్ ఆహ్వానం : సినిమా చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సోనూసూద్, కుమారి ఆండీ ఫుడ్ స్టాల్​ను సందర్శించి ఆమె కుటుంబసభ్యులతో సరదాగా కాసేపు గడిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి పుడ్ స్టాల్​ను పెట్టుకొని అసామాన్య గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీని ఆయన అభినందించారు. స్వయంగా ఆమెను సన్మానించి భోజనం వడ్డించారు. అయితే తాను 80 రూపాయల భోజన ప్రియున్ని అంటూ చమత్కరించిన సోనుసూద్, తన ఫతే చిత్రానికి సెలబ్రిటీ గెస్ట్​గా కుమారి అంటీని రావాలని ఆహ్వానించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.