ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నావో చెప్పడానికి సిద్ధమా జగన్?: బీజేవైఎం - జగన్ పై బీజేవైఎం వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 5:02 PM IST
BJYM state President Fire On CM Jagan in Kadapa : రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నుంచి అమరావతి వరకు ఎక్కడ చూసినా సిద్ధం అనే పోస్టర్లు తప్ప మరి ఏమీ కనిపించడం లేదని లేదని బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా) రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంత మంది నిర్వాసితులకు ఇళ్లు కట్టించారో చెప్పడానికి సిద్ధమా అని ప్రశ్నించారు.
ఐదేళ్ల కాలంలో ఎంత మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేందుకు, లిక్కర్ స్కామ్లో ఎన్ని వేలకోట్ల రూపాయలు వెనకేసుకున్నావని చెప్పడానికి సిద్ధమా? ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పేందుకు నీవు గాని నీ అనుచరులు గానీ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్లో అడవుల్లో ఉండాల్సిన ఎర్రచందనం స్మగ్లర్లు అసెంబ్లీలో దర్జాగా తిరుగుతున్నారని ఆరోపించారు.