LIVE : ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ రైతు హామీల సాధన దీక్ష - BJP Protest at Dharna Chowk Live - BJP PROTEST AT DHARNA CHOWK LIVE
🎬 Watch Now: Feature Video
Published : Sep 30, 2024, 12:27 PM IST
|Updated : Sep 30, 2024, 1:27 PM IST
BJP Protest on Congress at Indira Park : రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టింది. ఉదయం పదకొండు గంటల నుంచి మంగళవారం ఉదయం పదకొండు గంటల వరకు ఇరువై నాలుగు గంటల పాటు దీక్ష నిర్వహించనుంది. ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్ష స్థలితో పాటు ఇతర ఏర్పాట్లను పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పిన రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్ వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించింది. ఈ దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షకు మద్దతు తెలపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.
Last Updated : Sep 30, 2024, 1:27 PM IST