ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? : సత్యకుమార్ - బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 5:42 PM IST

BJP National Secretary Sathya Kumar On ABVP Activists Arrest: ఎన్నికలు సమీపిస్తున్న వేళ యువతను మోసం చేసేందుకే ముఖ్యమంత్రి జగన్ దగా డీఎస్సీ (DSC)ని విడుదల చేశారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. తాడేపల్లి వద్ద ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి మంగళగిరికి తరలించటంపై సత్య కుమార్, అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత పక్షాన పోరాటం చేస్తున్న అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుల (ABVP leaders)ను అరెస్టు చేయడాన్ని సత్యకుమార్ ఖండించారు.

విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను తీవ్రవాదుల్లా అరెస్టు చేసి కొన్ని గంటలపాటు జైల్లో ఉంచుతారా అని సత్యకుమార్ ప్రశ్నించారు. పరీక్ష సమయం పెంచమని కోరుతున్నందకు పోలీస్​స్టేషన్​లో పెడతారా అని అన్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని ప్రశ్నించినందుకు అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్​కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యోగ ప్రకటన పేరుతో గత ఐదేళ్లుగా యువతను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని సత్యకుమార్ ఆరోపించారు.  ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఎక్కువమంది యువత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని పదవి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి మాట మార్చారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.