నా గెలుపునకు సహకరించిన హరీశ్‌రావుకు ధన్యవాదాలు : రఘునందన్ రావు - BJP MP Raghunandan Rao Comments - BJP MP RAGHUNANDAN RAO COMMENTS
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 11:04 PM IST
BJP MP Raghunandan Rao Comments On Harish Rao : తమ గెలుపులో అనునిత్యం వెంటాడి తనను ఓడించాలని హరీశ్ రావు చూశారని మెదక్ ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావు అన్నారు. మెదక్ స్థానంలో బీజేపీ గెలవకూడదని హరీశ్ రావు ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పుట్టిన మెదక్ గడ్డపై ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచిందని విమర్శించారు. తమ గెలుపులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన హరీశ్ రావుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలువలేక పోయిందన్నారు. దేశంలో ఎన్టీఏ కూటమి విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు.
తమ గెలుపుకు అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తను మెదక్ సీటు గెలవడానికి సహకరించిన పెద్దలందరకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.