LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం - BJP MP Laxman Live - BJP MP LAXMAN LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 16, 2024, 11:14 AM IST
|Updated : Apr 17, 2024, 4:31 PM IST
BJP MP Laxman Press Meet at Party Office Live : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న సమయంలో బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే దేశంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తోందో మేనిఫెస్టో రూపంలో తెలియజేసింది. 14 అంశాలతో ఇటీవలే సంకల్ప పత్రాన్ని మోదీ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోను ప్రతి రాష్ట్రంలో ప్రజలకు తెలిసేలా రాష్ట్ర నాయకులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ మేనిఫెస్టోను ప్రజలకు వివరించేందుకు ఎంపీ లక్ష్మణ్ హైదరాబాద్‌లో బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అందులోని అంశాలను వివరిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో 17 స్థానాల్లో గెలిచేందుకు ప్రణాళికలు గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికల్లో రెండంకెల స్థానాలను దక్కించుకుంటామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేస్తున్నారు.
Last Updated : Apr 17, 2024, 4:31 PM IST